RAYALASEEMA · AP
ABOUT US

మా గురించి

శివగణ ఆర్ట్స్ అనేది కథలు, సంస్కృతి, సంప్రదాయాలు మరియు సామాజిక అంశాలను శక్తివంతమైన దృశ్య రూపంలో ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో స్థాపించబడిన సృజనాత్మక సంస్థ.

మేము కేవలం డాక్యుమెంటరీలు నిర్మించే సంస్థ మాత్రమే కాదు. డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లు, ఫీచర్ ఫిల్మ్స్, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు, టైటిల్ సాంగ్స్, డిజిటల్ కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ మరియు AI ఆధారిత క్రియేటివ్ సొల్యూషన్స్ రంగాల్లో పనిచేస్తున్నాము.

OUR VISION

మా విజన్

మా మూలాలు రాయలసీమ అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కథ, ప్రతి సంస్కృతి, ప్రతి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం. ప్రాంతీయ కథలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. సినిమా, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లు మరియు డిజిటల్ కంటెంట్ ద్వారా శాశ్వతమైన సాంస్కృతిక గుర్తింపును నిర్మించడం మా లక్ష్యం.

OUR JOURNEY

మా ప్రయాణం

చిన్న ప్రయత్నాలతో ప్రారంభమైన మా ప్రయాణం నేడు ప్రభుత్వ సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు వేలాది ప్రేక్షకుల విశ్వాసాన్ని సంపాదించింది. మా సృజనాత్మకత, నాణ్యత మరియు బాధ్యతాయుతమైన పనితీరు మాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.

WHAT SETS US APART

మా ప్రత్యేకత

01

కథ చెప్పడంలో బలం

ప్రతి ప్రాంతానికి చెందిన నిజమైన భావోద్వేగాలను తెరపై సహజంగా చూపించగల సామర్థ్యం.

02

సాంస్కృతిక అవగాహన

స్థానిక సంప్రదాయాలు, జాతరలు, దేవరలు మరియు ప్రజా జీవన విధానాలపై లోతైన అవగాహన.

03

ప్రభుత్వ కమ్యూనికేషన్

సామాజిక సందేశాలను ప్రజలకు సమర్థవంతంగా చేరే విధంగా రూపొందించే అనుభవం.

OUR EDGE

తక్కువ బడ్జెట్ — అత్యుత్తమ ఫలితాలు

మా ప్రధాన బలం తక్కువ వ్యయంతో అత్యధిక నాణ్యతను అందించడం. సృజనాత్మకత, అనుభవం మరియు AI ఆధారిత వర్క్‌ఫ్లోల సహాయంతో తక్కువ బడ్జెట్‌లో కూడా పెద్ద స్థాయి కంటెంట్‌ను రూపొందించే సామర్థ్యం మాకు ఉంది.

OUR BELIEF — మా నమ్మకం

“సంస్కృతి అనేది గతం కాదు… భవిష్యత్తుకు అందించాల్సిన వారసత్వం. కథ అనేది వినోదం కాదు… సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి.”